National News : మమత అడ్డాలో మోడీ వేవ్.. ఏకంగా హైకోర్టు జడ్జి బీజేపీలోకి జంప్

National News : మమత అడ్డాలో మోడీ వేవ్.. ఏకంగా హైకోర్టు జడ్జి బీజేపీలోకి జంప్

దేశంలో పాలిటికల్ వెదర్ మునుపెన్నడూ లేని రీతిలో మారుతోంది. రాజకీయాలు శాసన, పాలన, న్యాయవ్యవస్థల్లోకి చేరిపోయాయి. తాజాగా బెంగాల్ హైకోర్టు (Bengal HighCourt) న్యాయమూర్తి అభిజిత్ గగంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడి వరకు బానే ఉంది.. కానీ ఆయన బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఇదే నేషనల్ వైడ్ బర్నింగ్ టాపిక్.

కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ ఇచ్చిన తీర్పులు చాలా వరకూ వివాదాస్పదంగా ఉన్నాయి. రెండేళ్లుగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా అనేక తీర్పులు ఇచ్చారు. చిన్న చిన్న కేసుల్ని కూడా ఈడీకి , సీబీఐకి వెళ్లేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై మమతా బెనర్జీ పార్టీ లెక్క లేనన్ని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరుతానని ప్రకటించడంతో.. అక్కడి అధికార పార్టీ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలకు బలం చేకూరింది.

బీజేపీ తనను సంప్రదించిందని.. తాను బీజేపీని సంప్రదించానని చెప్పుకొచ్చారు అభిజిత్ గంగోపాధ్యాయ. న్యాయమూర్తులు వివాదాస్పద తీర్పులు తరవాత ప్రభుత్వాల నుంచి పదవులు పొందుతున్నారు. అనుకూల తీర్పులు ఇచ్చిన తర్వాత కొంత మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చాక రిటైరైపోయిన వారికి పదవులు ఇస్తున్నారు. ఏపీలోనూ అలా కొంత మందికి పదవులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటివి తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story