President Droupadi Murmu : నీట్ నిందితులను వదలం : రాష్ట్రపతి
ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) అన్నారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరగా లని చెప్పారు. పేపర్ లీక్ లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనల్లో రాజకీ యాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసర ముండని తెలిపారు. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.
ఇవాళ ఆమె పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పా ర్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధ„డ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులను అభినందిస్తూ తన ప్రసం గాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి ఆమె అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని అన్నారు. నిజా యతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని అశిస్తున్నాని. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నా రని. ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించిం దని, ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నా రని చెప్పారు. సంస్కరణలు, పనితీరు, మార్పు ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగు తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉందని, ఆయుష్మా న్ భారత్ అనేది గేమ్ ఛేంజర్ గా నిలుస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలుచేస్తోందని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com