Madhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి కారు, పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వాహనాల్లో చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. దీనికి స్థానికులు కూడా సహాయం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని రత్లాం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులు రత్లాం, మందసౌర్, జోధ్‌పూర్ జిల్లాలకు చెందినవారని ఎస్‌పి మనోజ్‌కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన గ్యాస్ ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com