Kejriwal : రాజీనామాపై కేజ్రీవాల్ హాట్ కామెంట్

ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన అరవింద్ కేజీవాల్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లినందున ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లపై స్పందిం న ఆయన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని స్పష్టం చేశారు.
ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పలు అంశాలను ప్రస్తావించారు. తాను గతంలో ఇన్కమ్ టాక్స్ కమిషనర్ పదవిని వదులుకుని ఢిల్లోని మురికివాడల్లో పని చేసినట్లు చెప్పారు. 2013లో ముఖ్యమంత్రి అయిన తాను 40 రోజుల్లోనే రాజీనామా చేశానని చెప్పారు. ఆ సమయంలో ఎందుకు రాజీనామా చేశారని ఎవరూ అడగలేదన్నారు. ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని, అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేయనని చెప్పారు.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు ఆప్ గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ను ఓడించలేమని భావించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను అరెస్ట్ చేయించారని, తప్పుడు కేసులతో ఆప్ కీలక నాయకులైన మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా మరికొంతమందిని బీజేపీ అరెస్ట్ చేయించిందని అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com