Priyanka Gandhi : ఇన్ని రూ.కోట్లు బీజేపీకి ఎలా వచ్చాయి.. ప్రియాంక సూటి ప్రశ్న

X
By - Manikanta |16 May 2024 10:53 AM IST
దేశంలో ఎన్నికల్లో బీజేపీ భారీగా ఖర్చుచేస్తోందని.. ఆ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. బీజేపీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో జనాలకు తెలియాలన్నారు.
ఈ ప్రపంచంలో ధనిక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీనే అని ఆరోపించారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ 50ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఇంత డబ్బు తమ పార్టీ వద్ద లేదన్నారు.
బీజేపీ కేవలం 10ఏళ్లలోనే వేల కోట్లు సంపాదించిందని ప్రియాంకగాంధీ దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ బీజేపీపై పలు విమర్శలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com