India-Pakistan : బోర్డర్ దాటి ఎందరు వెళ్తున్నారు.. ఎందరు వచ్చారంటే?

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 24 నుంచి అట్టారీ-వాఘూ బార్డర్ నుంచి 786 మంది పాకిస్తానీయులు తమ దేశానికి వెళ్లారు. ఆ దేశంలో ఉన్న వేయిన్నీ 376 మంది భారతీయులు మన దేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. పాకిస్తానీయులు భారత్ వదిలి వెళ్లాలంటూ డెడ్‌లైన్ పెట్టింది. దీనిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డెడ్‌లైన్ లోపు భారత్ వదిలివెళ్లాలని, లేనిపక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షాట్ టర్మ్ వీసాలకు ఈనెల 26 వరకు, మెడికల్ వీసా ఉన్న వారికి ఈనెల 29 వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. ఇప్పుడు భారత్‌లో ఉన్న పాకిస్తానీయులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయనున్నారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com