PM Modi : గంగమ్మ దత్త పుత్రుడిని నేను.. మోడీ హాట్ కామెంట్

కాశీ ప్రజల ప్రేమ, ఆశీస్సుల వల్లే తనకు దేశ ప్రధాని అయ్యే అవకాశం లభించిందని ప్రధాని మోదీ ( PM Modi ) తెలిపారు. కాశీ ప్రజలు నన్ను మూడోసారి తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారన్నారు. గంగామాత నన్ను దత్తత తీసుకుంది. నేను ఇప్పుడు వారణాసిలో భాగంగా ఉన్నాను. 18వ లోక్ సభ ఎన్నికల్లో దేశంలో 64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు.. అని ప్రధాని మోదీ చెప్పారు. పీఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా అపూర్వం. ఈ తీర్పు కొత్త చరిత్రను సృష్టించింది. ఎన్నికైన ప్రభుత్వం వరుసగా మూడోసారి తిరిగి రావడం ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది 60 ఏళ్ల కిందట భారత్ లో జరిగింది. అప్పటి నుంచి భారత్ లో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి హ్యాట్రిక్ సాధించలేదు.... అని ప్రదాని మోదీ చెప్పారు.
వికసిత్ భారత్ కు రైతులు, యువత, మహిళా శక్తి, పేదలు నాలుగు కీలక స్తంభాలని, తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులు, పేదలకు సంబంధించిన అంశంపైనే తొలి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
ఎన్నికల్లో 31 కోట్ల మంది మహిళా ఓటర్లు పాల్గొన్నారు, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న రికార్డు ఇది అని ప్రధాని మోదీ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com