IAF Tejas Aircraft : జైసల్మేర్‌లో కూలిన IAF తేజస్ విమానం

భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్ ఈ రోజు మధ్యాహ్నం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కుప్పకూలింది. ఆపరేషన్ శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించింది.
విమానం శిక్షణలో ఉండగా జైసల్మేర్‌లోని జవహర్ కాలనీ సమీపంలో అకస్మాత్తుగా విమానం కూలిపోయింది. స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో పైలట్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన
ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం ఒక ప్రకటనను పంచుకుంది. "భారత వైమానిక దళానికి చెందిన ఒక తేజస్ విమానం జైసల్మేర్ వద్ద ఈరోజు కార్యాచరణ శిక్షణలో ప్రమాదానికి గురైంది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ ఏర్పాటు చేశాం" అని వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com