India and Pakistan : అణుస్థావరాల వివరాలు మార్చుకున్న భారత్-పాక్

India and Pakistan : అణుస్థావరాల వివరాలు మార్చుకున్న భారత్-పాక్
X

తమ దేశాల్లోని అణు స్థావరాల వివరాలను భారత్, పాకిస్తాన్ పస్పరం మార్పిడి చేసుకున్నాయి. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఇరుదేశాలు ఈ ఏడాది కూడా పాటించాయి. ఈవిషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరోదేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూరితేసినట్లు విదేశాంగ శాఖ బుధవారం నాటి ప్రకటనలో తెలిపింది. దౌత్యమార్గాల ద్వారా భారత్, పాక్ తమ అణుస్థావరాల వివరాల జాబితాను పంచుకున్నాయి. ఈ ప్రక్రియ ఏకకాలంలో పూర్తయింది. కాశ్మీర్ సమస్యతోపాటు సీమాంతర ఉగ్రవాదంపై కూడా రెండు దేశాల మధ్య జాబితా మార్పిడి జరిగింది. ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం ఇది 34వ సారి అని సదరు ప్రకటన తెలిపింది. అణుస్థావరాల వివరాలు ఇచ్చిపుచ్చుకోవడం అనే ఒప్పందంపై 1988 డిసెంబర్ 31న ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఆర్టికల్ 2 నిబంధనల ప్రకారం ప్రతిఏటా ఈ ప్రక్రియ జరగాలి. దీని ప్రకారం 1992 జనవరి 1 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

Tags

Next Story