దేశ GDP కీలక గణాంకాలు వెల్లడి

దేశ GDP కీలక గణాంకాలు వెల్లడి
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP 7.2 శాతం వృద్ధి చెందింది

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన దేశ స్థూల జాతీయోత్పత్తి గణాంకాలు వెల్లడయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP 7.2 శాతం వృద్ధి చెందింది. ఇదే ఏడాది చివరి త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్‌, నిర్మాణ రంగాలు రాణించడంతో వృద్ధికి దోహదపడింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం GDP గణాంకాలను వెల్లడించింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.1 శాతం కాగా.. 2022-23లో 7.2 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 13.1 శాతం, జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 6.2 శాతం, అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో 4.5 శాతం, జనవరి- మార్చి త్రైమాసికంలో ఇది 6.1 శాతంగా ఉంది. ఇదే సమయంలో చైనా 2023 తొలి మూడు నెలల్లో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story