BRICS : ఇండియా బ్రిక్స్ కూటమిలో కొనసాగితే 10 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే

ఇండియా బ్రిక్స్ కూటమిలో కొనసాగితే 10 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే. అమెరికాను ఇబ్బంది పెట్టడానికే బ్రిక్స్ ఏర్పాటు చేశారు. బ్రిక్స్ డాలర్ విలువను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. వాళ్లు గేమ్ ఆడితే నేను కూడా ఆడతా. బ్రిక్స్‌లో ఉన్న వాళ్లెవరైనా 10 శాతం టారిఫ్ చెల్లించాల్సిందే. నేను ఏడాది క్రితమే చెప్పాను. ఇప్పటికే బ్రిక్స్ చీలిపోయింది. ఒకరిద్దరు దానిని పట్టుకుని వేలాడుతున్నారు. బ్రిక్స్‌తో పెద్ద ముప్పేమి లేదు. డాలర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డాలర్‌ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగడానికి వీల్లేదు. నువ్వు తెలివైన అధ్యక్షుడివైతే అది జరగనివ్వకూడదు. నువ్వు బిడెన్ లాంటి పిచ్చి ప్రెసిడెంట్ ఐతే నువ్వు ఓడిపోతావు. డాలర్ విలువ కోల్పోతే ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లే. డాలర్ ఎప్పటికీ రాజే. దానిని కొనసాగిస్తాం. ఎవరైనా దీనిని ఎదిరించాలనుకుంటే...మూల్యం చెల్లించాల్సిందే. బ్రిక్స్ కూటమిలో ఉన్న వాళ్లు ఆ సాహసం చేస్తారని నేను భావించట్లేదు అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com