Indian Army : బోర్డర్‌లో ఏఐ కెమెరాలతో సైన్యం నిఘా

Indian Army : బోర్డర్‌లో ఏఐ కెమెరాలతో సైన్యం నిఘా
X

సరిహద్దుల్లో చొరబాటుదారులను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత సైన్యం ఆధునిక సాంకేతికతో కూడిన ఏఐ కెమెరాలను వినియోగిస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం బంగ్లాదేశ్ సరి హద్దుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. కెమెరాలు, ఫేషియల్ రికగ్నేషన్ పరిక రాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరి హద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు.

ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరో ధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని, ఆ ప్రాంతాల్లోని బ్రోకర్లు, స్మగ్లర్ల నెట్వర్క్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని వివరించారు.

Tags

Next Story