Pakistan : వరదలో కొట్టుకుపోయి దేశం దాటేసాడు

గత కొంతకాలంగా పాకిస్తాన్ నుంచి భారత్ కు, భారత్ నుంచి పాక్ ఎగిరిపోతున్న ప్రేమపక్షులను చూస్తున్నాం. అక్రమంగా వచ్చి వెళుతున్న వారిపై పోలీసులు నిఘా కూడా పెట్టారు. ఇది కూడా అలాంటి అక్రమ వలసగానే చెప్పుకోవచ్చు.. కానీ ఇది పాపం తెలియకుండా జరిగిపోయింది. అదెలాగంటే..
పంజాబ్ లో భారీ వరదల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవేశించే సట్లెజ్ నది వరద ప్రవాహం అయితే ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ వరద ప్రవాహంలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. పంజాబ్ లోని కసూర్ జిల్లాకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దారీ తెన్ను తెలియక నీటి ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు వెళ్లిపోతూ అలా పాకిస్తాన్ కు చేరాడు. అతడు ఏకంగా దేశ సరిహద్దులు దాటేశాడు. పాకిస్తాన్ నేలపై అడుగుపెట్టిన అతనిని సరిహద్దు పోలీసులు అడ్డుకున్నారు. అయితే అతను మూగవాడు కావడంతో సైన్ లాంగ్వేజ్ నిపుణుల సహాయంతో అతను భారతదేశానికి చెందిన వ్యక్తి అని, కసూర్ జిల్లా వాసిగా తెలుసుకున్నారు. లాహోర్ నుంచి అతను నివసించే ప్రాంతం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వాస్తవానికి ఇది అక్రమ వలస అనుకోవాల్సిందే. విచారణ చేపట్టిన పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తేల్చి తిరిగి భారత అధికారులకు అప్పగించారు. పంజాబీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గత వారంలో చేరాభినదిలో వరదలు 40 గ్రామాలను ముంచుతాయి. సుమారు 48 వేల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com