EC : ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ
దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు.
ఈ ఎన్నికల సమయంలో సీ-విజిల్ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని రాజీవ్ కుమార్ తెలిపారు. వీటిల్లో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించామని. ఇందులో 87.5శాతం వాటికి 100 నిమిషాల్లోపే పరిష్కారం చూపామన్నారు. డీప్‌ఫేక్ వీడియోలను నిలువరించామని చెప్పారు. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. రూ.10వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. 2019లో ఈ సంఖ్య రూ.3,500కోట్లుగా ఉందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com