మహిళా దినోత్సవం : మోదీకి జైరామ్ రమేశ్ 5 ప్రశ్నలు

మహిళా దినోత్సవం :  మోదీకి   జైరామ్ రమేశ్ 5 ప్రశ్నలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మహిళలకు సంబంధించిన 5 ప్రశ్నలు ప్రధాని మోదీకి సంధించారు. మణిపుర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించడంపై మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపైనా మోదీ నిశ్శబ్దానికి కారణమేంటని అడిగారు. దేశంలో ధరల పెరుగుదల, బేటీ బచావో బేటీ పడావో యోజన ఏమైంది? దేశంలో మహిళా భద్రత లేకపోవడం గురించి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, మహిళలకు శుభాకాంక్షలు చెప్పడం కంటే ప్రధాని అంతకంటే ఏదో చేస్తారని మేము ఆశించడం లేదనిజైరాం రమేష్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం కంటే ఇప్పుడు శ్రామిక శక్తిలో మహిళల శాతం 20 శాతం తక్కువగా ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రమేష్ అన్నారు.

మహిళలను మళ్లీ ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రధాని వద్ద పరిష్కారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక "బేటీ బచావో బేటీ పఢావో" పథకాన్ని ప్రారంభించారని, అయితే ఆ పథకం బడ్జెట్‌లో దాదాపు 80 శాతం ప్రకటనలకే కేటాయించారని తేలిందన్నారు

Tags

Read MoreRead Less
Next Story