Prajwal Revanna : తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ అత్యాచారం చేశాడు: బాధితురాలు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అతనిపై అత్యాచారంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు JDS మహిళా కార్యకర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం బయటకు చెప్తే తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. కాగా ప్రజ్వల్‌ను రక్షించేందుకు కేంద్రం యత్నిస్తోందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
కర్ణాటకలో JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల ఉదంతం దేశంలో సంచలనంగా మారింది. ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు నెటిజన్లు లోక్‌సభ ఎన్నికలు, మోదీ, రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా ఆయన వీడియోల గురించే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు తేలింది. ట్విట్టర్ లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ వీడియోల కోసం వెతుకుతున్న వారిలో కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, సిక్కిం, మిజోరం, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ , బిహార్ ప్రజలు టాప్‌లో ఉన్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com