Kamal Haasan : డీఎంకే కూటమిలోకి కమల్ హాసన్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని (Tamilnadu) అధికార డీఎంకే (DMK) సారథ్యంలోని కూటమిలో కమల్ పార్టీ 'మక్కల్ నీథి మయ్యం' చేరినట్టు ప్రకటించారు. పొత్తులో భాగంగా 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఒక సీటు కేటాయించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్.. తమ పార్టీ కానీ, తాను కానీ ఈ (లోక్‌సభ) ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కూటమి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. డీఎంకే కూటమితో చేరడం పదవుల కోసం కాదని, దేశం కోసమని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం మాట్లాడుతూ, ఎంఎన్ఎం పార్టీ ఈఎన్నికల్లో పోటీచేయడం లేదన్నారు. ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు. కూటమిలో భాగంగా 2025లో రాజ్యసభలో ఎంఎన్‌ఎస్‌కు ఒక సీటు కేటాయింపు ఉంటుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com