Kangana : కంగనకు చేదు అనుభవం

Kangana : కంగనకు చేదు అనుభవం
X

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం లాహౌల్, స్పితి జిల్లాలోని కాజాకు వెళ్లిన కంగనా వాహనాన్ని అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

నల్లజెండాలు ప్రదర్శిస్తూ కంగనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కంగనా వెంట హిమాచల్ మాజీ సీఎం ప్రతిపక్షనేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. అయితే కంగనా వాహన శ్రేణికి అడ్డు వచ్చిన కాంగ్రస్ కార్యకర్తలను పోలీసులు అడ్డు తప్పించారు.

అనంతరం కంగనా, జైరామాకూర్ సభా స్థలికి వెళ్లి ఆసభలో ప్రసంగించారు. మండి లోక్సభ స్థానానికి ఏడోదశ ఎన్నికల్లో భాగంగా జూన్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న మొత్తం ఏడుదశల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Tags

Next Story