Kangana Ranaut : కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?

Kangana Ranaut : కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ తనకు రూ.91.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అందులో రూ.28.73 కోట్ల చర.. రూ.62.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ముంబయి, పంజాబ్‌, మనాలిలో కొన్ని ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్న కంగన.. రూ.3.91 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిపారు.

ఆమె పేరిట ₹17.38 కోట్ల అప్పు ఉంది. అఫిడవిట్ ప్రకారం ఆమె వద్ద 6 కిలోల బంగారు, 60 కిలోల వెండి, ₹3 కోట్లు విలువచేసే వజ్రాభరణాలు ఉన్నాయి. కంగనా రనౌత్‌పై 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కంగనా చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు.

ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఇక ఆమెకు పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌ బరిలోకి దిగారు. తనకు రూ.96.70 కోట్లు సంపద ఉన్నట్లు ఈసందర్భంగా ఆయన ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story