Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లిలో కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు

ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు వెళ్లనున్నాయి. అతిథులకు ప్రసిద్ధి చెందిన హస్తకళారూపాలను ఇవ్వాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి జ్యూయలరీ బాక్సులు, ట్రేలు, పర్సులు వంటి వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. వెండి తీగతో ఇక్కడి కళాకారులు వస్తువుల్ని రూపొందిస్తారు. గతేడాది జీ20 సదస్సుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి నుంచే పంపారు.
గత మార్చిలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్, రిహన్న వంటి విదేశీ ప్రముఖులతోపాటు దేశంలోని ప్రముఖ నటులు, క్రీడాకారులు హాజరైన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే పెండ్లికి కూడా దేశ, విదేశాలకు చెందిన సుమారు 400 మంది ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. పెండ్లికి వచ్చే గెస్టులకు గిఫ్టులు ఇవ్వడానికి వెండితో చేసిన జ్యువెల్లరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ ఇతర బహుమతులు ఇవ్వనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com