Arvind Kejriwal : సుప్రీం కోర్టులో కేజీవాల్ కు చుక్కెదురు

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలన్న ఆయన అభ్యర్థనను అత్యు న్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజీవాల్ ఇదివరకే అవకాశం ఇచ్చినందున.. ఈ పిటిషన్ ను విచారిం చడం సాధ్యం కాదని తెలిపింది. బెయిల్ పొడగింపు కోసం కింది కోర్టుకే వెళ్లాలని సూచించింది. అంతకుముందు కేజ్రివాల్ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. పిటిషన్ను ఎప్పుడు విచారించాలన్న అంశంపై సీజేఐ చం ద్రచూడ్ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్ట్ వెకేషన్ బెంచ్ నిన్నవె ల్లడించింది. మధ్యంతర బెయిల్ను విచారిస్తున్న బెంచ్ ఉన్నప్పుడే ఈ పిటిషన్ను ఎందుకు దాఖలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. కాగా, , ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న కేజీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. మే 10న ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ మజూరైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com