Delhi CM : కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన.. మరోసారి ఆదేశాలు!

లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఈడీ కస్టడీలో ఉన్నారు. తాజాగా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్‌లలో టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు చెప్పాయి. అంతకుముందు నీటి సమస్య నివారణకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే కేజ్రీవాల్ ఆదేశాలు బయటకు ఎలా వెళ్తున్నాయని తెలుసుకునేందుకు ఈడీ చర్యలు చేపట్టింది. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు తాము కంప్యూటర్ లేదా పేపర్ ను సమకూర్చలేదని ఈడీ తెలిపింది. ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఈ వివాదం సద్దుమణగక ముందే కేజ్రీవాల్ నుంచి రెండో సారి ఆదేశాలు రావడం ఆసక్తికరంగా మారింది.
కాగా మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామా చేయులేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com