Delhi : కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన.. 18 ఏళ్లు నిండితే ప్రతి నెల రూ.1000

Delhi : కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన..  18 ఏళ్లు నిండితే ప్రతి నెల రూ.1000

ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆప్ సర్కార్ కొత్త స్కీమ్ ను ప్రకటించింది. ఢిల్లీలో18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 ఇస్తుందని ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా తన ప్రసంగంలో తెలిపారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామన్నారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో మంత్రి అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించామని అన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం రూ.76,000 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా , బడ్జెట్ కేటాయింపులు గతేడాదితో పోలిస్తే రూ.2000 కోట్లు తగ్గాయి. విద్య కోసం రూ. 16,396 కోట్లు కేటాయించింది, ఇది బడ్జెట్ వ్యయంలో దాదాపు 21% వస్తుంది. 2014లో ఢిల్లీ జీఎస్‌డీపీ రూ.4.95 లక్షల కోట్లు కాగా, గత పదేళ్లలో ఢిల్లీ జీడీఎస్పీ రెండున్నర రెట్లు పెరిగి రూ.11.08 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి అతిషి మర్లెనా చెప్పారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని, విద్యకు 16,396 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఢిల్లీ ఆర్థిక మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story