Amit Shah : కశ్మీర్ సెక్యూరిటీపై రేపు అమిత్ షా కీలక సమావేశం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎంహెచ్ఎ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా.. రియాసి లో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, సీఆర్పీ ఎఫ్ ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్నారు. జమ్మూకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు, ఉగ్రవాద ఘటనల అనంతరం తీసుకున్న చర్యలపై హోంమంత్రికి సమాచారం అందించినట్లు సమాచారం.
గత నాలుగు రోజుల్లో జమ్మూ కశ్మీర్ లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది యాత్రికులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా, ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. కతువా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా మరణించారు. అలాగే వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సమీక్ష అనంతరం అమిత్ షా భద్రతా బలగాల వ్యూహాత్మక మోహరింపు, ఉగ్రవాద నిరోధక చర్యల కార్యాచరణ అంశాలపై దృష్టి సారించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com