Kishan Reddy : జమ్మూకశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి
త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ( Kishan Reddy ) జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్-హరియాణా, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్రయాదవ్-మహారాష్ట్ర, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వశర్మను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గెలుపే లక్ష్యంగా బీజేపీ ఇన్‌ఛార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు పార్టీ అధిష్టానం ఇంఛార్జిలను నియమించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com