Leopard : ఢిల్లీలో నివాసితులపై చిరుతపులి దాడి

వాయువ్య ఢిల్లీలోని బురారీలోని నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. చిరుతపులి (Leopard) పైకప్పుపై నుండి దూకడం, భయాందోళనలో ఉన్న నివాసితులు దాన్ని కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించే ఓ వీడియో బయటపడింది. ఈ క్రమంలో చిరుతపులి 4 నుంచి 5గురిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో చిరుతను ఓ గదిలో బంధించారు.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, సంఘటన గురించి వారికి ఈ ఉదయం 6.20గంటలకు సమాచారమందింది. దీంతో వారు వెంటనే రెండు టెండర్లను ఘటనాస్థలానికి పంపించారు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో చిరుతను ఓ గదిలో బంధించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.
జగత్ పూర్ గ్రామం నుంచి ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించినట్టు తమకు కాల్ వచ్చిందని, వెంటనే తాము అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలిస్(నార్త్) ఎంకే మీనా తెలిపారు. చిరుతపులి దాడిలో ఐదుగురు గాయపడ్డారని, వారిలో ముగ్గురిని మహేందర్, ఆకాష్, రాంపాల్ గా గుర్తించామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com