Civil Supply Scam : సివిల్ సప్లై స్కాంపై ప్రధాని, హోంమంత్రికి లెటర్ రాస్తాం : మహేశ్వర్ రెడ్డి

Civil Supply Scam : సివిల్ సప్లై స్కాంపై ప్రధాని, హోంమంత్రికి లెటర్ రాస్తాం : మహేశ్వర్ రెడ్డి
X

ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు బీజేపీ ఎల్పీ నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి. గత మూడు రోజులుగా సివిల్ సప్లై మీద మాట్లాడుతున్నా ఆ అంశాన్ని ముఖ్యమంత్రి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి స్పందించే ప్రయత్నం చేయడం లేదన్నారు. గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులతో తనపై కేసులు పెట్టించారనీ.. సరైన సమయంలో కష్టమర్స్ రైస్ కొనుగోలు చేసేటప్పుడు రసీదు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

రైస్ మిల్లులో సీ ఎమ్ ఆర్ కింద రైస్ అందుబాటులో ఉన్నాయా అని అడిగారు మహేశ్వర్ రెడ్డి. సివిల్ సప్లై విషయంలో మోసం జరుగుతుంటే ఎలా అడ్డుకుంటున్నారు.. లోపాయికారి ఒప్పందం ఎలా చేసుకున్నారు.. సివిల్ సప్లై విషయంలో టెండర్లు ఎందుకు పెట్టారు.. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి గింజను కొంటా అన్న తరువాత ఎందుకు టెండర్లకు ఇచ్చారు.. జల సౌధలో రహస్య ఒప్పందం ఏంటి.. 2,223 టెండర్ల దగ్గర రైస్ కొంటున్నట్లు అబద్ధపు ఆధారాలు సృష్టించడమేంటి అని ప్రశ్నలవర్షం కురిపించారు.

3,500 వచ్చే రైస్ ను 5,700 పెట్టి కొనాల్సిన అవసరం సివిల్ సప్లై కి ఏముందని అడిగారు మహేశ్వర్ రెడ్డి. సన్న బియ్యంలో అమ్మకం, కొనుగోలు అంశాలు మాట్లాకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని అనడం ఏంటిని అన్నారు. సివిల్ సప్లై మ్యాటర్ సీబీఐకి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. ప్రధాని మోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags

Next Story