LK Advani : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత

LK Advani : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత
X

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ( LK Advani ) అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. కాగా.. అద్వానీ ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఏం జరిగిందనే విషయంపై అద్వానీ సన్నిహితులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్ల కాగా.. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక వార్డులో ఉంచి ఎయిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story