Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికలు.. రేపే తుది విడత పోలింగ్

లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు EC పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్‌లో 12, బిహార్‌లో 8, బెంగాల్‌లో 9, హిమాచల్ ప్రదేశ్‌లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్టులో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గ BJP అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక జూన్ 4న కంగనకు ‘కన్యాదానం’ చేసి హిమాచల్ నుంచి పంపిస్తామని అన్నారు. ఆమె ఒక కాలు ముంబైలో ఉంటే మరో కాలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉందని, అలాంటి వ్యక్తి హిమాచల్ వాసుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com