Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఈ మెయిల్ హ్యాక్

Maharashtra :  మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్  ఈ మెయిల్ హ్యాక్
X

Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Naarvekar) ఈ మెయిల్ హ్యాక్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నార్వేకర్ పోలీసు కేసు నమోదు చేశారు. ఆయన మెయిల్ ఐడీ నుండి మహారాష్ట్ర గవర్నర్‌కు ఒక మెయిల్ పంపగా.. దాన్ని నార్వేకర్ తిరస్కరించారు. గవర్నర్ కార్యాలయాన్ని విచారించగా, నార్వేకర్ తాను అలాంటి మెయిల్‌లేవీ పంపలేదని చెప్పారు.

సభలో సరిగా ప్రవర్తించని కొందరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మెయిల్‌లో రాసి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై నార్వేకర్ ముంబై పోలీసులకు సమాచారం అందించగా, తదనుగుణంగా దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story