Vasant Chavan : మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ రావు చవాన్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి మృతిచెందారు. చవాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.
వసంతరావ్ చవాన్ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమించబడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంతరావు నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి 59,442 ఓట్లతో గెలుపొందారు. ఇక, ఆయన మరణం మహారాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటు అంటూ పార్టీ నేతలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com