Maharashtra : మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఫడ్నవీస్!.. రాష్ట్రపతి పాలనకు రౌత్ డిమాండ్

మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొత్త సీఎంపై అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. ఐతే.. మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ గా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. ఏ క్షణంలోనైనా ఫడ్నవీస్ పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు నచ్చజెప్పి వారిద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. మంగళవారం లోపే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ను కలిసి మహాయుతి కూటమి వినతిపత్రం సమర్పించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ గడువు ముగిసేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడి.. సీఎం ప్రమాణస్వీకారం తప్పనిసరి కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. చట్టాలు పాటిస్తూనే కూటమి తమ నిర్ణయాలు తీసుకుంటోందని పార్టీల నేతలు చెబుతున్నారు. ఐతే.. భారీ విజయం సాధించినప్పటికీ గడువులోగా మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన ఉద్ధవ్ పార్టీ నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com