Snakes : 35 రోజుల్లో 6 సార్లు పాము కాటు!

Snakes : 35 రోజుల్లో 6 సార్లు పాము కాటు!
X

యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వికాస్ దూబే(24) అనే వ్యక్తిని 35 రోజుల వ్యవధిలో 6 సార్లు పాములు కాటేశాయి. గత నెల 2న తొలి కాటు మొదలు 4సార్లు పాము కరిచాక భయంతో మేనత్త ఊరికి వెళ్లిపోయాడు. అక్కడా కాట్లు తప్పలేదు. ఈ నెల 6న ఆరోసారి పాము కరిచింది. కాటు పడిన ప్రతిసారీ వెంటనే ఆస్పత్రికి తరలించడంతో బతికి బట్టకట్టాడు. కాటేసింది ఒకటే సర్పమా లేక వేర్వేరు సర్పాలా అన్నది తెలియాల్సి ఉంది. కాగా పాముకాట్లు నేపథ్యంలో వికాస్ దూబే ఆరోగ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాముకాట్లు అన్ని శనివారం లేదా ఆదివారాల్లో జరిగాయని, ప్రతిసారీ కరవడానికి ముందస్తు తనకు సూచన అర్థమయ్యేదని వికాస్ దూబే వాపోయాడు.

Tags

Next Story