Marriage : ఎన్నికల కోసం 60 ఏళ్లకు పెళ్లి

Marriage : ఎన్నికల కోసం 60 ఏళ్లకు పెళ్లి

బిహార్‌లో (Bihar) అశోక్ మహతో(60) అనే గ్యాంగ్‌స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా, చట్టపరంగా సాధ్యం కాలేదు. 2001లో నవాడా జైల్‌ బ్రేసక్‌ కేసులో మహతో దోషిగా తేలడంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయాడు. దీంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి(44) అనే మహిళను గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఎన్నికల బరిలో నిలపనున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు.

బీహార్‌లోని నవాదా జిల్లాలోని కోనన్‌పుర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ మహతో అనే గ్యాంగ్‌స్టర్‌.. షేక్‌పురా జేడీయూ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన రణధీర్ కుమార్ సోనీ హత్యాయత్నం, అలాగే నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా రుజువైంది. దీంతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా 2023లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.

లాలూ సూచనతో అనిత అనే మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక తన భార్య అనితను ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్లు రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి. తన భార్య ద్వారా మహతో రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Tags

Next Story