PM Modi : మోడీ ఇంటికి భారీ భద్రత.. ఆప్ శ్రేణుల ముందస్తు అరెస్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ తో ఆప్ రగిలిపోతోంది. లిక్కర్ స్కాం కేసులో తమ పార్టీ కన్వీనర్, సీఎంను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం కాదని అంటోంది. ఆయన అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు ఆప్ నేతలు. దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఢిల్లీ పటేల్ చౌక్ ప్రాంతానికి పెద్దఎత్తున ఆప్ నేతలు చేరుకున్నారు. అక్కడి నుంచి తుగ్లగ్ రోడ్డు మీదుగా లోక్ మాన్య మార్గంలో ఉన్న మోడీ ఇంటికి వెళ్లాలని డిసైడయ్యారు. ప్రధాని నివాసం వద్ద ఎప్పుడు భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. తాజాగా ఆప్ పిలుపుతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత పెంచారు పోలీసులు.
పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. మోడీ ఇంటివైపుగా వచ్చేవారిని అరెస్ట్ చేసి దగ్గర్లోని స్టేషన్ కు తరలిస్తోంది. భారీసంఖ్యలో వచ్చే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయు గోళాలు లాంటివి కూడా సిద్ధం చేశారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com