Medha Patkar : మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు

Medha Patkar : మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు
X

పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కు ( Medha Patkar ) ఢిల్లీ కోర్టు ఐదు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. 24 ఏళ్ల నాటి ఈ కేసులో సోమవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న వీకే సక్సెనా ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో మేధా పాట్కర్ ఈ ఏడాది మేలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ కోర్టు దోషిగా తేల్చారు.

నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించినందుకు సక్సేనాపై దావా వేయడం ద్వారా ఆమె పరువునష్టం కేసును ఎదుర్కొంటూ వచ్చారు. 2000 నుండి న్యాయ పోరాటం సాగిస్తోంది. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్ కు చెందిన ఎన్టీ వో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ చీఫ్ గా ఉన్నారు. ఒక టీవీ ఛానెల్లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కలిగించే ప్రకటన జారీ చేసినందుకు సక్సేనా ఆమెపై రెండు కేసులు కూడా పెట్టారు.

ఈ కేసులో పాట్కర్ ను దోషి గా నిర్ధారిస్తూ, జైలు శిక్ష ఖరారుచేసింది. అయితే 69 ఏళ్ల పాట్కర్ ఆమె వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా కఠిన కారాగార శిక్ష విధించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాట్కర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే వరకు 30 రోజుల పాటు జైలు శిక్ష వాయిదా పడుతుంది.

Tags

Next Story