Jammu Kashmir : కశ్మీర్ తోటలో నక్కిన ఉగ్రవాదులు.. కొనసాగుతున్న ఆపరేషన్

కశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులు కాగా, ఏడుగురు ఉగ్రవా దులు హతమైనట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే బిర్ది తెలిపారు. కుల్గామ్ లోని మోదర్మ్, చినిగామ గ్రామాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల్లో ఇద్దరు మదర్గాంలో, మిగిలిన వారు చినిగామ్లో హతమయ్యారు.
మోదర్ గామ్లోని ఒక తోటలో నిర్మించిన రహస్య స్థావరంలో ఉగ్ర వాదులు దాక్కున్నట్లు వార్తలొచ్చాయి. చిని గామ్ ఫ్రీసల్లో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్ లో 1వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన హవల్దార్ రాజ్కుమార్, పారా కమాండో రాన్స్ నాయక్ ప్రదీప్ నైన్ వీరమరణం పొందారని వీకే బిద్ధి తెలిపారు. ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హస్తం కశ్మీర్లో వరుసగా చోటుచేసుకున్న ఉగ్ర దాడుల వెనుక లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిత్ జట్ హస్త మున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
పాకిస్తాన్ లోని కసూర్ జిల్లా లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు శంగమంగ గ్రామానికి చెందిన సాజిత్ ఎన్ఐఏ తెలిపింది. సైఫుల్లా సాజిద్ జట్ ఇస్లామాబాద్ లో బేస్ క్యాంపు కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com