MLC Elections Notification : ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల

MLC Elections Notification : ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల
X

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీ లోని ఉ.గోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోని మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ ఇది.

ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 10 నామినేషన్‌లకు గడువు

ఫిబ్రవరి 11 నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 13 నామినేషన్ల ఉపసంహరణ

ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్

మార్చ్ 3 నుంచి మార్చ్ 8 వరకు ఓట్ల లెక్కింపు

ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని చెప్పారు. అంతేగాక నిర్వహణ కోసం పోలింగ్ కోసం రిటర్నింగ్ అధికారులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు.

Tags

Next Story