Modi 3.0: వీళ్లకు మళ్లీ చోటు దక్కలేదు

Modi 3.0: వీళ్లకు మళ్లీ చోటు దక్కలేదు

మోదీ 2.0 ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 37మందికి ఈసారి కేబినెట్‌లో చోటు దక్కలేదు. వీరిలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకుర్, నారాయణ్ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, RK సింగ్, మహేంద్రనాథ్ కేబినెట్ ర్యాంక్ మంత్రులుగా పని చేశారు. మిగతా 30మంది సహాయమంత్రులు. వీరిలో 18మంది ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ కేబినెట్‌లో తిరిగి చోటు దక్కించుకున్న నేతగా L.మురుగన్ నిలిచారు.

కేరళ నుంచి ఇద్దరికి చోటు

కేరళలో బీజేపీకి ( Kerala BJP ) తొలి విజయాన్ని అందించి రికార్డు సృష్టించిన సురేశ్ గోపికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. త్రిశ్శూర్ నుంచి MPగా పోటీ చేసిన ఈ నటుడు.. CPI నేత సునీల్ కుమార్‌పై 74వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కేరళ నుంచి మరో BJP నేత అయిన జార్జ్ కురియన్‌కు సైతం మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఈయన ప్రస్తుతం కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

నరేంద్రమోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు(36). ఈయన 2014, 19, 24లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు తర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్ జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41), రాష్ట్రీయ లోక్‌దళ్ ఎంపీ జయంత్ చౌదరి (45) ఉన్నారు. అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ (79) ఉన్నారు.

Tags

Next Story