PM Modi : కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ : మోడీ

PM Modi : కాంగ్రెస్ బాధ్యత లేని పార్టీ : మోడీ
X

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముస్లింల మనసుల్లో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. అది ఒక బాధ్యతారహితమైన పార్టీ అని, హిందువులను విభజించి, ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటోందని ఆరోపించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఫ్యాక్టరీలా కాంగ్రెస్ తయారైందని మండిపడ్డారు. మహారాష్ట్రలో 7వేల 600 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. హిందువులు ఎంతగా చీలిపోతే అంత లాభపడుతుందని కాంగ్రెస్‌కు తెలుసని అందుకే దేశమంతా విధ్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని తెలిపారు.

Tags

Next Story