PM Modi : ఈడీ విషయంలో మేం జోక్యం చేసుకోం: మోదీ

ఎలక్టోరల్ బాండ్స్‌ను (Electoral Bonds) సుప్రీం కోర్టు (Supreme Court) రద్దు చేయడంపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కాదని ఆయన అన్నారు. ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదని, ఏ లోపాలున్నా సవరించవచ్చని అన్నారు. తమకు ఎందుకు ఎదురు దెబ్బ అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై చంకలు గుద్దుకుంటున్న వారు పశ్చాత్తాప పడక తప్పదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి అత్యధికంగా విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనేది స్వతంత్ర సంస్థ అని, దాని పనితీరు విషయంలో తమ జోక్యం ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘ఈడీ వద్ద 7వేల కేసులు ఉన్నాయి. వాటిలో రాజకీయ నేతలపై కేసులు 3శాతం కంటే తక్కువే. ఆ సంస్థ పనిని మేం అడ్డుకోం. స్వతంత్రంగా పనిచేసి, నిజాల్ని బయటపెట్టాల్సిన బాధ్యత ఈడీదే’ అని పేర్కొన్నారు. కేంద్రం ఈడీని ఆయుధంలా వాడుకుంటోందన్న ‘ఇండియా కూటమి’ ఆరోపణలపై ప్రధాని స్పందించడం ఇదే తొలిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com