Modi : శ్రీ కృష్ణుడిని మోడీ అవమానించారు.. కౌంటర్ బైట్

ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు ప్రధాని మోడీ (Prime Minister Modi). 'ఈరోజు కుచేలుడి ఆరోపణలు స్వీకరించి ఉంటే కృష్ణుడిని కూడా అవినీతిపరుడే' అని చెప్పేవారేమో అని మోడీ అన్నారు. దీనిపై ఎవరైనా ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తే, అది అవినీతిగా కోర్టు తీర్పు ఇస్తుందని ప్రధాని అన్నారు. కల్కిధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. దీనిపై సీపీఎం కౌంటర్ ఇచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల విషయంపై సుప్రీం కోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కప్పిపుచ్చేకునేందుకే ప్రధానమంత్రి మోడీ శ్రీకృష్ణుడి ఉపమానాన్ని ఉపయోగించారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ విమర్శించారు. నిజానికి ఈ ఉపమానంతో శ్రీకృష్ణున్ని మోడీ అవమానించారని అన్నారు.
కార్పొరేట్లకు సేవకుడిగా మోడీ పరిపాలన చేస్తున్నారనీ బేబీ అన్నారు. మోడీ తనకు తాను ఒక రాజుగా భావించుకుంటున్నారని .. అదానీ, అంబానీ వంటి వ్యాపారవేత్తల నుంచి ఎన్నికల బాండ్లు తీసుకుని వారికి మళ్లీ తిరిగి ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, చమురు వ్యాపారం, టెలికాం సంస్థలు ఇవ్వడానికి మోడీ రాజు కాదని బేబీ కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com