Campaign Song : లోక్‌సభ ఎన్నికల కోసం మోదీ ప్రచార గీతం ప్రారంభం

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం (మార్చి 16) 'మేన్ మోదీ కా పరివార్ హూన్' అనే ప్రచార గీతాన్ని ప్రారంభించారు. ప్రధాని ఈసారి ఎన్నికల ర్యాలీల్లో మై భాయ్ మోదీ కా పరివార్ అనే నినాదాన్ని ఉపయోగిస్తున్నారు. తనకు కుటుంబం లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించారు.
దీంతో బీజీపీ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. దీని కింద కేంద్ర మంత్రులతో సహా వారందరూ X హ్యాండిల్ బయోలో మోదీ కా పరివార్ గా రాడుకొచ్చరు. ఈవిధంగా ప్రధానికి సంఘీభావంగా, ప్రతిపక్షాలకు సందేశం ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. పార్టీలు ఎన్నికల కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తూ తమ ఓట్లను రాబట్టుకునేందుకు జనాల్లోకి వెళ్తున్నాయి.
मेरा भारत-मेरा परिवार
— BJP (@BJP4India) March 16, 2024
मेरे दिल के घर में वो रहता
मेरी फिक्र हमेशा करता है…
दुख दर्द मेरा समझे वो,
मेरी खुशी में शामिल रहता है…
वो नहीं अकेला खड़ा यहां,
मैं उसका संसार हूं…
मैं मोदी का परिवार हूं...#MainHoonModiKaParivar pic.twitter.com/AB6GMZFTNp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com