PM Modi : ట్విట్టర్ లో100M ఫాలోవర్స్.. మోదీ రికార్డు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ల మార్కును చేరుకుంది. ఇండియా నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన తొలి రాజకీయ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఓవరాల్‌గా అత్యధిక ఫాలోవర్ల జాబితాలో ఏడో స్థానానికి చేరారు. తొలి ఆరు స్థానాల్లో ఎలాన్ మస్క్(188.7M), ఒబామా(131.7M), రొనాల్డో(112M), జస్టిన్ బీబర్(110.5M), రిహన్నా(108M), కాటీ పెర్రీ(106.3M) ఉన్నారు.
మోడీ ఫాలోయింగ్ పరంగా భారతీయ నాయకుల కంటే ముందుండటమే కాదు.. విదేశీ నాయకులలో కూడా ముందున్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, పలువురు విదేశీ నేతలు మోడీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. జో బిడెన్‌కి ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో గత మూడేళ్లుగా దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ ను పెరిగారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది ప్రజలు ఆయనను అనుసరిస్తున్నారు. మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.2 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది, యూట్యూబ్‌లో 24.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో వాట్సాప్ ఛానెల్‌లో కూడా 13 మిలియన్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com