MODI:ముష్కరులను ముక్కలు ముక్కలు చేశాం

MODI:ముష్కరులను ముక్కలు ముక్కలు చేశాం
X
పాకిస్థాన్‌కు మరోసారి మోదీ వార్నింగ్.. ముష్కరులను మట్టిలో కలిపేశాం

పహల్గామ్‌లో రక్తపుటేరులు పారించిన పాకిస్థాన్ ఉగ్రవాదులను ముక్కులు ముక్కలు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాక్ ను మోకాళ్ల మీద నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోడి సంచలన వ్యాఖ్యలు చేశారు. " మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం" అని ప్రధాని అన్నారు. రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ... బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మరోసారి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను అంతం చేశామని మోదీ తెలిపారు. కేంద్రం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని... మన దళాలు చక్ర వ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడికి జవాబుగా 23 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. భారత్‌లో రక్తపుటేర్లు పారించిన వాళ్లను ముక్కలు.. ముక్కలు చేసినట్లు మోడీ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని.. మతం ఆధారంగా వేరు చేసి.. మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచేశారని.. దానికి ప్రతీకారంగానే మన దళాలు వాళ్లను మట్టిలో పాతిపెట్టేశారని ప్రధాని అన్నారు.

140 కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉగ్రవాదులు గాయపరిచారని... అందుకే వాళ్లను ముక్కలు.. ముక్కలు చేశామని వెల్లడించారు. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాదుల శిబిరాలు నాశనం అయినట్లు చెప్పారు. త్రివిధ దళాల దెబ్బకు పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని తెలిపారు. ఇక అణు బాంబుల భయానికి భారతదేశం వెనుకాడదని మరోసారి మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నదని ఇక పాకిస్తాన్ కుట్రలు నడవనన్నారు. ఇకపై ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు దమ్కీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ మన వైపు వచ్చినప్పుడల్లా భారత్ దే గెలుపు అని ఇది పాత భారత్ కాదని ఇది నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని అందుకు తమ ప్రభుత్వం... త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాక్ కుట్రల్ని ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయల్దేరారన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపం అని ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని సమర్థ భారత రౌద్ర రూపం... మోదీ అన్నారు. భారత్ ను ఎప్పటికి తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story