PM Modi : కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగా.. మోడీ కామెంట్స్ వైరల్

PM Modi : కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగా.. మోడీ కామెంట్స్ వైరల్
X

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనకు 'చాయ్'కి ఉన్న సంబంధం ఎంతో ప్రత్యేమైనదిగా చెప్పారు. "చిన్నతనంలో కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను. నేను టీ అందించేవాడిని, మోడీకి టీకి మధ్య సంబంధం చాలా లోతైనది" అని ఆదివారం మీర్జాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ అన్నారు.

సమాజ్ వాదీ పార్టీకి ఓటీసి ఎవరూ కూడా తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరని, మునిగిపోయే వారికి ఎవరు ఓటు వేయరని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారికే ఓటేస్తారని ప్రధాని అన్నారు. ప్రజలకు ఇండియా కూటమి గురించి చాలా బాగా తెలుసని, వారు మతవిద్వేషకులని, కులపిచ్చి ఉన్నవారని, వారు అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో ఈ రెండింటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించారు.

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పై విమర్శలు గుప్పిస్తూ.. యాదవ సామాజిక వర్గంలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన కుటుంబానికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు. ఎస్పీకి చెందిన వ్యక్తులు పట్టుబడిన ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేవారని, ఇందులో ఎవరైనా పోలీస్ అధికారి అయిష్టంగా ఉంటే అతడిని సస్పెండ చేసేవారని, యూపీ, పూర్వాంచల మాఫియాకు అడ్డాగా మార్చారని ప్రధాని అననారు.

Tags

Next Story