PM Modi : ఎలక్టోరల్ బాండ్స్ పై మోదీ ఏమన్నారంటే?

ఎన్నికల్లో పారదర్శకత రావాలంటే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు ప్రధాని మోదీ. ‘ఎన్నికల్లో పార్టీలు డబ్బును ఖర్చు చేసే మాట నిజం. ఇందులో నల్లధనానికి చోటు లేకుండా పారదర్శకత తేవాలని చేసిన చిన్న ప్రయత్నమే ఈ స్కీమ్. ఇది రద్దు కావడంతో దేశాన్ని మళ్లీ నల్లధనంవైపు నెట్టేసినట్లు అయింది. దీని పరిణామాలు గురించి తెలుసుకున్నాక అందరూ చింతిస్తారు’ అని పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీ ఎక్కువగా లబ్ధి పొందిందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ‘మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్న తర్వాత 16 కంపెనీలు పార్టీలకు డొనేషన్ ఇచ్చాయి. ఇందులో బీజేపీకి 37% వస్తే, 63% డొనేషన్ ప్రతిపక్షాలకే వెళ్లింది. మరి ప్రతిపక్షాలకు ఆ డొనేషన్ ఎలా వచ్చింది?’ అని ప్రశ్నించారు. కాగా ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను ఓ సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు మోదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com