Mahua Moitra : మరో వివాదంలో చిక్కుకున్న ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ( Mahua Moitra ) మరో వివాదంలో ఇరుక్కున్నారు. జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ పోలీసులు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్డ్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ రేఖా శర్మపై చేసిన అవమానకరమైన వ్యా ఖ్యలకు సంబంధించి ఎక్స్ హ్యాండిల్ నుంచి వివరాలను తీసుకుంటుంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖా శర్మ సందర్శించారు. ఆమెకు సంబంధించిన వీడియోలో ఒక వ్యక్తి వెనక గొడుగు పట్టుకుని కనిపిస్తారు. రేఖా శర్మ తన సొంత గొడుగు ఎందుకు పట్టుకోవడం లేదని ఒక యూజర్ ప్రశ్నించిన నేపథ్యంలో, మహువా మోయిత్రా స్పందిస్తూ.. ఆమె తన బాస్ పైజామా పట్టుకోవడంలో చాలా బిజీగా ఉంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి.
తాను పశ్చిమ బెంగాల్ నదియాలో ఉన్నానని, రాబోయే మూడు రోజులు ఇక్కడే ఉంటానని, కావాలంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయాలని మహువా మోయిత్రా సవాల్ విసిరారు. తాను తన సొంత గొడుగు పట్టుకోగలనని అన్నారు. వెస్ట్ బెంగాల్ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. గతేడాది ఆమె ప్రశ్నకు డబ్బు కేసులో ఎంపీ పదవిని కోల్పోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com