Swati Maliwal : దాడిపై ఎంపీ స్వాతి మాలీవాల్ సంచలన స్పందన

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై జరిగిన దాడి మీద ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ స్పందించారు. ఆరోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు.
ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 'దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు. దీనిపై నా క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించిన వారికీ దేవుడు మంచి చేయాలనే కోరుకుంటున్నా' అంటూ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు.
దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేస్తూ.. తనపై జరిగిన దాడిని రాజకీయం చేయొద్దని బీజేపీ నేతలకు స్వాతి మలివాల్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న కేజ్రీవాల్ నివాసంలోనే ఈ వివాదాస్పద ఘర్షణ దాడి ఘటన జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆప్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com