PM Modi : ప్రధాని మోడీతో తెలుగులో మాట్లాడిన ముద్రా లబ్దిదారురాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా యోజన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ దేశ వ్యాప్తం గా ఉన్న లబ్ధిదారులతో ముచ్చటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లబ్ధిదారులు తోనూ మాట్లాడారు. ఓ మహిళా లబ్ధిదారు సమావేశంలో పాల్గొని పీఏం దృష్టికి తన అనుభవాలను తీసుకువెళ్లారు. హిందీ రాదని, తెలుగులోనే మాట్లాడుతానని చెప్పగా ప్రధాని అనుమతించారు. తనకు 2009లో పెళ్ళయిందని, అప్పటి నుంచి 2019 వరకూ గృహిణిగానే ఉన్నాను అని వెల్లడించారు. 2019లో తనకు కెనరా బ్యాంక్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 13 రోజుల పాటు జ్యూట్ సంచుల తయారీలో శిక్షణనిచ్చారని తెలిపారు. ముద్రా యోజన పథకం కింద బ్యాంక్ ద్వారా తనకు 2 లక్షల రూపాయల రుణం అందిందన్నారు. దాంతో నవంబర్ 2019లో సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాను అని వెల్లడించారు. బ్యాంక్ అప్పుని నేను సకాలంలో తీర్చినందువల్ల 2022లో బ్యాంక్ వారు నాకు మరో 9.5 లక్షల రుణాన్ని మంజూరు చేశారు.. ఇప్పుడు నా వద్ద 15 మం ది పని చేస్తున్నారు అని ఏపీ నుంచి ఓ మహిళా లబ్ధిదారు తెలిపారు.
దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. 2 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టిన మీరు 9.5 లక్షల వరకు చేరుకున్నారు.. మీ వద్ద ఎంత మంది పని చేస్తున్నారన్నారు? అని అడిగారు. దానికి లబ్ధిదారు 15 మంది సర్.. వీరంతా గృహిణులే.. అందరూ గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో (ఆర్సీటీ) శిక్షణ పొందిన వారేనని వెల్లడించారు. ఒకప్పుడు నేను శిక్షణార్ధిగా ఉన్న.. నేను ఈరోజు నలుగురికి శిక్షణనిచ్చే బోధకురాలిగా మారాను. ఇటువంటి అద్భుతమైన అవకాశం నాకు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నాను అంటూ ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com